సంకష్టహర సిద్ధి వినాయక ।
సర్వేశ్వరి తనయ । గణనాయక ।
నీరాజనమిదె లంబోధరా ।
వరముల నందించి నను బ్రోవరా ।
సంకష్టహర సిద్ధి వినాయక ।
సర్వేశ్వరి తనయ । గణనాయక ।
ఏడాది పాటు నియమాలు గూడి
వేడుకగ నీ దీక్ష చేయంగ బూనాను
పంచామృతాల అభిషేకమే చేసి
పలువిరులతో నిన్ను సేవింతునయ్యా ।
సంకష్టహర సిద్ధి వినాయక ।
సర్వేశ్వరి తనయ । గణనాయక ।
దూర్వాల మాలనే కంఠాన వేసి
సాంబ్రాణి వెలిగించి సంతృప్తి నొంది
మోదకాలు, పాయసము భక్తితో చెల్లించి
మదిమార నీ భజన నే చేతునయ్యా ।
సంకష్టహర సిద్ధి వినాయక ।
సర్వేశ్వరి తనయ । గణనాయక ।
నీ మందహాసము కొండంత ధైర్యము
కలిగించునయ్యా । కరిరాజ వదనా ।
ప్రతికార్యమందును విఘ్నాలు లేకుండా
విజయాలు సతతము నందించవయ్యా ।
సంకష్టహర సిద్ధి వినాయక ।
సర్వేశ్వరి తనయ । గణనాయక ।

0 Comments