- వాక్ శుద్ధి
- దేహ శుద్ధి
- భాండ శుద్ధి
- కర్మ శుద్ధి
- మనశ్శుద్ధి
దేహ శుద్ధి: మన శరీరం దేవుని ఆలయం వంటిది, దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి, చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.
భాండ శుద్ధి: శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం, అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి స్నానం చేసి, పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది
కర్మ శుద్ధి: అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు. అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.
మనశ్శుద్ధి: మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది, ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది, దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి దీని వల్ల దుఃఖం చేకూరుతుంది కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...
0 Comments