Ad Code

IKEA - ఐకియ - ప్రస్థానం

IKEA - ఐకియ - ప్రస్థానం

IKEA - ఐకియ - ప్రస్థానం
ఐకియ - ప్రస్థానం: 17 యేళ్ల యువకుడు 1943 లో స్వీడన్ లో స్థాపించిన సంస్థ, IKEA. నాకు తెలిసి ఇలాంటి పేరే ప్రపంచం లో లేదు. మొదటి రెండు అక్షరాలు అతని పేరు (ఇంగ్వర్ క్రాంపార్డ్), మూడవ అక్షరం అతను పెరిగిన వ్యవసాయ క్షేత్రం లో మొదటిది, నాల్గవ అక్షరం అతను పుట్టిన ఊరు లోని మొదటి అక్షరం. అన్నీ కలిపి "IKEA" గా పేరు పెట్టాడు.

బాగా బతికి చెడిన కుటుంభం & మూడు పూటలు తినటానికి అన్నం లేక ...5 వ తరగతి చదివేటప్పుడే అగ్గి పెట్టెలు అమ్మేవాడు ఇంగ్వర్. ఒక అగ్గిపెట్టె కొంటే 25 పైసలు. ఇంగ్వర్ 200 అగ్గిపెట్టెలని బల్క్ లో 10 పైసలు లెక్కన కొని తమ ఊర్లోని వారికి 15 పైసల లెక్కన అమ్మేవాడు. చౌక గా వస్తున్నై అని అందరూ ఇంగ్వర్ దగ్గరే కొనేవారు. చుట్టు ప్రక్కల ఊర్ల నుంచి కూడా జనాలు వచ్చి కొనేవారు.

6-10 తరగతి చదివే రోజుల్లో ఫ్రాన్స్ నుంచి 500 పెన్నులు, పెన్సిల్స్ బల్క్ లో కొని చాలా చౌక గా స్వీడన్ లో అమ్మేవాడు. 10 వ తరగతి పాస్ అయినందుకు తండ్రి 1000 రూపాయలు ఇచ్చి కొత్త ప్యాంట్, షర్ట్ లేదా సూట్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే దానితో " IKEA సంస్థ" ని స్థాపించాడు ఆ 17 యేళ్ల యువకుడు. అతను కాలేజీ చదువులు చదవలేదు, యూనివర్శిటీ మొఖం చూడలేదు.

ఆ తర్వాత స్వీడన్ లోనే కాకుండా, నార్వే, ఫిన్ ల్యాండ్ మిగతా ఐరోపా దేశాలు, ఖండాల్లో కూడా ఐకియ స్థాపించాడు. కాలక్రమం లో దక్షిణ అమెరికా తప్ప మిగతా ప్రపంచం అంతా ఐకియ స్టోర్స్ వెలిశాయి.

ఇంగ్వర్ క్రాంపార్డ్ ప్రపంచం లోని టాప్ 10 సంపన్నులలో ఒకడు. కానీ, బస్ లల్లో నే ప్రయాణిస్తాడు. పాత వోల్వో కార్ లోనే తిరుగుతాడు. తను కూడా ప్రతి రోజూ మార్కెట్ కి పోయి కూరగాయలు కొంటాడు. యూరప్ లోని విమానాలు అన్నింటినీ కొనగలడు. కానీ, విమానం లో సాధారణ టికెట్ కొని ప్రయాణిస్తాడు. ఇలా ఎందుకు అని ఎవరైనా అడిగితే డబ్బు ఉంది కదా అని విచ్చల విడి గా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఇంకా అలాంటి పనులు నాకు ఆనందం వేయవు. మా తాత పెట్టిన ఒక కంపనీ అప్పుల్లో ఉండి తాతయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా.. మా కస్టమర్స్ ఎలా బ్రతుకుతున్నారో నేను అలానే బ్రతుకుతాను అంటాడు ఇంగ్వర్ క్రాంపార్డ్.

తన ఫర్నీచర్ స్టోర్ లో లభ్యమయ్యేది అంతా కలప నుంచే కాబట్టి, తన వ్యాపారం వలన ఎన్విరాన్ మెంట్ కి తాను కీడు చేస్తున్నాడు అనిపించి 25 వేల ఎకరాలు కొని ఒక అడవినే పెంచాడు ఇంగ్వర్ క్రాంపార్డ్.

IKEA ఫర్నీచర్ స్టోర్ లో ప్రతి కొన్ని సెకండ్ల కి ఒక బుక్ షెల్ఫ్ అమ్ముడుపోతుంది. IKEA లో అత్యంత ఎక్కువు గా అమ్ముడు పోయేవి పుస్తకాలు పెట్టుకునే బుక్ షెల్ఫ్ లు.

బిలియనీర్ అయ్యాక కూడా సామాన్య జీవితం గడిపే పేదవాడు అని అతడ్ని ప్రపంచం అంతా అంటుంది. కానీ, సంపద లోనే కాదు, వ్యక్తిత్వం లో కూడా ప్రపంచం లో బిలియనీర్ అంటాను నేను.

గడిచిన 2 వేల సంవత్సరాలలో అత్యంత ఉన్నతమైన వ్యాపార వేత్త ఎవరు అని అడిగితే నేను మాత్రం IKEA ని స్థాపించిన "ఇంగ్వర్ క్రాంపార్డ్" అని చెప్తాను.

Post a Comment

0 Comments