మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తర ఆరణి లేడికొమ్ములలో యిరుకుకొని పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదౄష్యవాణి పలికినది ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆదీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి.
The Yaksha Prashna, also known as the Dharma Baka Upakhyan or the Ashkardhama, is the story of a riddle contest between Yudhishthira and a yaksha in the Hindu epic Mahabharata. It appears in the Vana Parva, Aranyaka-parva or Aranya-parva and the story is set as the Pandavas end their twelve years of exile in the forest.
క్రమ సంఖ్య | ప్రశ్న | సమాధానం |
---|---|---|
1 | సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? | బ్రహ్మం |
2 | సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? | దేవతలు |
3 | సూర్యుని అస్తమింపచేయునది ఏది? | ధర్మం |
4 | సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? | సత్యం |
5 | మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? | వేదం |
6 | దేనివలన మహత్తును పొందును? | తపస్సు |
7 | మానవునికి సహయపడునది ఏది? | ధైర్యం |
8 | మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? | పెద్దలను సేవించుటవలన |
9 | మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? | అధ్యయనము వలన |
10 | మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? | తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును. |
11 | మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? | మౄత్యు భయమువలన |
12 | జీవన్మౄతుడెవరు? | దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు |
13 | భూమికంటె భారమైనది ఏది? | జనని |
14 | ఆకాశంకంటే పొడవైనది ఏది? | తండ్రి |
15 | గాలికంటె వేగమైనది ఏది? | మనస్సు |
16 | మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? | ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది |
17 | తౄణం కంటె దట్టమైనది ఏది? | చింత |
18 | నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? | చేప |
19 | రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? | అస్త్రవిద్యచే |
20 | రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? | యజ్ణ్జం చేయుటవలన |
21 | జన్మించియు ప్రాణంలేనిది | గుడ్డు |
22 | రూపం ఉన్నా హౄదయం లేనిదేది? | రాయి |
23 | మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? | శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన |
24 | ఎల్లప్పుడూ వేగం గలదేది? | నది |
25 | రైతుకు ఏది ముఖ్యం? | వాన |
26 | బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? | సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు |
27 | ధర్మానికి ఆధారమేది? | దయ దాక్షిణ్యం |
28 | కీర్తికి ఆశ్రయమేది? | దానం |
29 | దేవలోకానికి దారి ఏది? | సత్యం |
30 | సుఖానికి ఆధారం ఏది? | శీలం |
31 | మనిషికి దైవిక బంధువులెవరు? | భార్య/భర్త |
32 | మనిషికి ఆత్మ ఎవరు? | కూమారుడు |
33 | మానవునకు జీవనాధారమేది? | మేఘం |
34 | మనిషికి దేనివల్ల సంతసించును? | దానం |
35 | లాభాల్లో గొప్పది ఏది? | ఆరోగ్యం |
క్రమ సంఖ్య | ప్రశ్న | సమాధానం |
36 | సుఖాల్లో గొప్పది ఏది? | సంతోషం |
37 | ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? | అహింస |
38 | దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? | మనస్సు |
39 | ఎవరితో సంధి శిధిలమవదు? | సజ్జనులతో |
40 | ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? | యాగకర్మ |
41 | లోకానికి దిక్కు ఎవరు? | సత్పురుషులు |
42 | అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? | భూమి, ఆకాశములందు |
43 | లోకాన్ని కప్పివున్నది ఏది? | అజ్ణ్జానం |
44 | శ్రాద్ధవిధికి సమయమేది? | బ్రాహ్మణుడు వచ్చినప్పుడు |
45 | మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? | వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో |
46 | తపస్సు అంటే ఏమిటి? | తన వౄత్బికుల ధర్మం ఆచరించడం |
47 | క్షమ అంటే ఏమిటి? | ద్వంద్వాలు సహించడం |
48 | సిగ్గు అంటే ఏమిటి? | చేయరాని పనులంటే జడవడం |
49 | సర్వధనియనదగు వాడెవడౌ? | ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు |
50 | జ్ణ్జానం అంటే ఏమిటి? | మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం |
51 | దయ అంటే ఏమిటి? | ప్రాణులన్నింటి సుఖము కోరడం |
52 | అర్జవం అంటే ఏమిటి? | సదా సమభావం కలిగి వుండడం |
53 | సోమరితనం అంటే ఏమిటి? | ధర్మకార్యములు చేయకుండుట |
54 | దు:ఖం అంటే ఏమిటి? | అజ్ణ్జానం కలిగి ఉండటం |
55 | ధైర్యం అంటే ఏమిటి? | ఇంద్రియ నిగ్రహం |
56 | స్నానం అంటే ఏమిటి? | మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం |
57 | దానం అంటే ఏమిటి? | సమస్తప్రాణుల్ని రక్షించడం |
58 | పండితుడెవరు? | ధర్మం తెలిసినవాడు |
59 | మూర్ఖుడెవడు? | ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు |
60 | ఏది కాయం? | సంసారానికి కారణమైంది |
61 | అహంకారం అంటే ఏమిటి? | అజ్ణ్జానం |
62 | డంభం అంటే ఏమిటి? | తన గొప్పతానే చెప్పుకోవటం |
63 | ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? | తన భార్యలో, తన భర్తలో |
64 | నరకం అనుభవించే వారెవరు? | ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు |
65 | బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? | ప్రవర్తన మాత్రమే |
66 | మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? | మైత్రి |
67 | ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? | అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు |
68 | ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? | సుఖపడతాడు |
69 | ఎవడు సంతోషంగా ఉంటాడు? | అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు |
70 | ఏది ఆశ్చర్యం? | ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం |
71 | లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? | ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు |
72 | స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? | నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు |
0 Comments